పారిస్ ఒలింపిక్స్‌లో ఇచ్చిన పతకాలు డ్యామేజ్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక మంది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఫిర్యాదులు చేశారు. ఈ జాబితాలో మను భాకర్ కూడా చేరారు. పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు పతకాలు సాధించింది. తన పతకాలు పాడైపోయాయని మను భాకర్ ఒలింపిక్ కమిటీకి ఫిర్యాదు చేశారు. పాడైన పతకాలను కమిటీ తిరిగి తీసేసుకుంటుంది. తిరిగి కొత్త పతకాలు అందజేస్తామని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Chittoor: సంక్రాంతి వేళ తీవ్ర విషాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన గాలిపటం ఎగరవేత
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అథ్లెట్లు పాడైన పతకాలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన పతకాలు కూడా పాడైనట్లు మను భాకర్ పేర్కొన్నారు. మెడల్ మధ్యలో పొందుపరిచే ఇనుప ముక్కలు 18 గ్రాములు బరువు కలిగి ఉంటుంది. ఇవి దెబ్బతిన్నాయి. అయితే దెబ్బతిన్న పతకాలను క్రమపద్ధతితో భర్తీ చేస్తారని… అసలైన వాటికి సమానంగా పతకాలు అందిజేస్తారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది. మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకున్నారు. దేశం నుంచి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి ఉమెన్‌గా నిలిచింది. 22 ఏళ్ల యువకుడు సరబ్జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతకాన్ని సాధించారు.
ఇది కూడా చదవండి: Chittoor: సంక్రాంతి వేళ తీవ్ర విషాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన గాలిపటం ఎగరవేత
2024 పారిస్ ఒలింపిక్స్ పతకాలను విలాసవంతమైన ఆభరణాలు తయారు చేసే చౌమెట్ సంస్థ డిజైన్ చేసింది. మొదటి విజేతకు స్వర్ణం, రెండోవ ప్లేస్‌లో గెలిచిన క్రీడాకారుడికి రజతం, మూడో ప్లేస్ విన్నర్‌కు కాంస్యం పతకాలు ఇస్తారు. అయితే గోల్డ్ మెడల్ విలువ రూ.62-71 వేల మధ్య ఉంటుంది. ఇందులో 92.5 శాతం వెండి, 6 గ్రాములు మాత్రమే బంగారం ఉంటుంది. స్విల్వర్ మెడల్ పూర్తిగా మెండితో తయారు చేస్తారు. దీని విలువ రూ.37 వేల వరకు ఉంటుంది. బ్రౌంజ్ మెడల్ 95 శాతం రాగి, 5శాతం జింక్ మిక్స్‌డ్ మెటల్‌తో తయారు చేస్తారు. దీని తయారు చేయడానికి రూ.500 ఖర్చు అవుతుంది. 2024 ఆగస్టులో పారిస్ ఒలింపిక్స్ నిర్వహించారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి ఈ క్రీడాపోటీలు పెడతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్నీ దేశాలు ఇందులో పాల్గొంటాయి. మెడల్స్ తయారీలో పారిస్‌లో ఫేమస్ అయిన ఈఫిల్ టవర్ నుంచి తీసిన ఓ మెటల్ ముక్కను వాడారు.
ఇది కూడా చదవండి: Hamas-Israel: దాయాది దేశాల మధ్య సయోధ్య! కాల్పులకు ముగింపు పడే సూచన