NTV Telugu Site icon

Manmohan Singh: శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు..

Manmohan Singh

Manmohan Singh

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (92) అస్తమయం చెందారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్‌ మృతికి పలువురు ప్రముఖుల సంతాపం తెలియజేస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ నివాసానికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూమార్గ్‌లోని తన నివాసంలో మన్మోహన్‌ పార్ధీవ దేహం ఉంచారు. రేపు (శనివారం) మన్మోహన్‌ సింగ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి వర్గం సమావేశం జరగనుంది. మన్మోహన్‌ సింగ్‌ మృతికి నివాళిగా వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా సంతాపదినాలు ప్రకటించనున్నారు. కాంగ్రెస్‌ కూడా పార్టీ కార్యక్రమాలను అన్నింటిని రద్దు చేసింది.

Read also: Manmohan Singh: దేశం ఆర్థిక వేత్తను కోల్పోయింది.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రుల సంతాపం!

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలిపారు. మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Read also: Telangana Govt: నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యాసంస్థలకు సెలవు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న (గురువారం) సాయంత్రం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ అస్వస్థతకు గురి కాగానే రాత్రి 8:06 గంటలకు ఎయిమ్స్‌కు తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి 9:51 నిమిషాలకు ప్రాణాలు వదిలారు. మన్మోహన్ సింగ్ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932లో అప్పటి అవిభక్త భారతదేశంలోని(ఇప్పటి పాకిస్తాన్ పంజాబ్)లోని గాహ్‌లో జన్మించారు. ఆక్స్‌ఫర్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు. ప్లానింగ్ కమిషన్ చీఫ్‌గా, ఎకనామిక్ అడ్వైజర్‌గా భారత ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేశారు. 1991 అప్పటి పీవీ నరసింహరావు మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

Kiccha Sudeep’s Max Review: కిచ్చా సుదీప్ ‘మాక్స్’ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

Show comments