తీహార్ జైలు నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విడుదలయ్యారు. లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరిలో సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. పలుమార్లు ఆయన బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యారు. శుక్రవారం మాత్రం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు, నేతలు జైలు దగ్గర ఘన స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: OG: అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు.. గెట్ రెడీ?
శుక్రవారం ఉదయం సుప్రీంకోర్టు సిసోడియాకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సిసోడియా తన పాస్‌పోర్టును సమర్పించాలని తెలిపింది. అలాగే వారానికి రెండుసార్లు సోమవారం, గురువారాల్లో పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని చెప్పింది. సిసోడియా గత 17 నెలలుగా జైలులో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Air India: ఇజ్రాయిల్ వెళ్లే విమానాలపై ఎయిర్ ఇండియా సస్పెన్షన్ కొనసాగింపు..