Site icon NTV Telugu

Manipur CM: అందుకే రాజీనామా చేయాలనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న..

Biren Singh

Biren Singh

Manipur CM: మణిపూర్ ఘర్షణల నేపథ్యంలో శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామాకు సిద్దమయ్యారు. రాజధాని ఇంఫాల్ జరిగిన హైడ్రామా నేపథ్యంలో ఆయన రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నారు. రాజీనామాను గవర్నర్ కి సమర్పించేందుకు రాజ్ భవన్ వెళ్లే సందర్భంలో ఆయన మద్దతుదారులు సీఎం ఇంటి ముందు భారీగా చేరుకున్నారు. రాజీనామా చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో ఆయన తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేయనని ఆన్నారు.

Read Also: Biryani: ఈస్ట్ ఆర్ వెస్ట్ “బిర్యానీ” ఈస్ బెస్ట్.. ఏకంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు..

రాజీనామా విషయంలో ఏఎన్ఐ ప్రశ్నించగా.. ‘‘రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రధాని మోదీ, హెచ్‌ఎం అమిత్ షా దిష్టిబొమ్మలను దహనం చేయడం చూశాను, బీజేపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించడం చూశాను. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మణిపూర్ కోసం 5-6 ఏళ్లలో ఎంతో చేశాయి. మనం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయామా..? అనే సందేహించానను, దీని గురించి ఆలోచిస్తే బాధ కలిగింది. కొన్ని రోజుల క్రితం ఒక మార్కెట్ లో చిన్న సమూహం నాపై దుర్భాషలాడింది..నాకు మంచిగా అనిపించలేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని బిరేన్ సింగ్ అన్నారు.

ప్రజావిశ్వాసం లేని నాయకుడు నాయకుడు కాలేడు, నేను ఇంటి నుంచి బయటకు వచ్చే సరికి వీధుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు నాకు మద్దతు తెలపడం సంతోషాన్ని కలిగించింది. వాళ్లు నాకోసం ఏడ్చారు, నాపై తమకున్న నమ్మకాన్ని చూపించారు. ఇది నాలో ఆలోచల్ని తప్పని చూపించాయని, ప్రజలు ఇప్పటికీ నాకు మద్దతుగా నిలిచారని.. రాజీనామా చేయొద్దని చెప్పారని.. వారు రాజీనామా చేయమని చెబితే చేస్తారు.. లేకపోతే చేయనని సీఎం అన్నారు. కొంతమంది సీఎం మద్దతుదారులు ఆయన రాజీనామా లేఖను బహిరంగంగానే చింపేశారు. రాహుల్ గాంధీని పర్యటనపై స్పందిస్తూ.. మేము ఎవరిని ఆపలేము..కానీ ఘర్షణలు జరిగిన 40 రోజుల తర్వాత మణిపూర్ వచ్చారు. అంతకుముందు ఎందుకు రాలేదు. రాష్ట్రంలో రాజకీయ మైలేజ్ గురించి వస్తే దాన్ని సమర్థించనని అన్నారు.

Exit mobile version