Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ..

Manipur Violence

Manipur Violence

Manipur: జాతి వ్యతిరేఖ ఘర్షణలతో గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. పరిస్థితి చేజారడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం బిరేన్ సింగ్ సహా మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికి కేంద్ర నాయకత్వాన్ని కలువనున్నారు. ఈ మేరుకు వారంతా ఢిల్లీ బయలుదేరారు.

Read Also: Off The Record : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నిక కాంగ్రెస్ కి అగ్నిపరీక్షలా మారిందా?

బిరేన్ సింగ్ ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర నాయకులను కలవడానికి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. కొత్తగా ప్రజాదరణ పొందిన ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడటానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, కీలకమైన రహదారుల్ని వీలైనంత త్వరగా తెరిచేందుకు కేంద్ర నాయకుల్ని కోరుతామని చెప్పారు. ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు రాష్ట్రంలో బిరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది. మే 3, 2023న జరిగిన సుదీర్ఘ జాతి హింస కారణంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడటానికి నాలుగు రోజుల ముందు, ఫిబ్రవరి 9న సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 60 మంది సభ్యులు కలిగిన మణిపూర్ అసెంబ్లీ సస్పెండ్ అయింది. మణిపూర్ అసెంబ్లీకి 2027 వరకు పదవీకాలం ఉంది.

Exit mobile version