Manda Krishna Madiga: తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఇప్పుడు దళితుల్లో కూడా సంపన్నులున్నారని తెలిపారు. క్రిమిలేయర్ ఎత్తేయడానికి వ్యతిరేకంగా 100 మంది ఎంపీలు ప్రధానిని కలిశారన్నారు. దళిత వర్గాల్లో పేదలకు న్యాయం జరగాలని దళిత వర్గాల ఎంపీలకు లేదా అన్నారు. దళిత వర్గాల్లో రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్న కొన్ని కుటుంబాలు పార్లమెంట్ లో తిష్ట వేశారన్నారు. పెద్దపల్లి లో వివేక్ వెంకట స్వామి కుటుంబం తిష్ట వేసిందన్నారు. మల్లు రవి, బట్టి విక్రమార్క రాజకీయంగా తిష్ట వేశారని తెలిపారు. బీహార్ లో రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం తిష్ఠ వేసిందన్నారు. మాయావతి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు.. పేద వ్యక్తి అని చెప్పాలా? అని తెలిపారు. మాయావతి క్రిమిలేయర్ కు వ్యతిరేకమని తెలిపారు. మల్లికార్జున ఖర్గే కుటుంబం రాజకీయాల్లో రిజర్వేషన్ ఫలాలు పొందుతుందన్నారు. పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా క్రిమిలేయర్ అడ్డుకుంటున్నారన్నారు.
Read also: Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..
క్రిమిలేయర్ వద్దనే వారు ప్రత్యామ్నాయ సూచనలు కూడా చేయడం లేదన్నారు. పేదరికం నుంచి బయటపడిన వారిని మినహాయించాలన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఆర్ధికంగా పేద కుటుంబాల విద్యార్థులకు కటాఫ్ మార్కుల్లో మింహాయింపు కల్పించాలని తెలిపారు. పాశ్వాన్, ఖర్గే, మాయావతి దళితుల్లో దనికులకే లీడర్లు అంటున్నారు. ఆర్ధికంగా ఉన్నత వర్గంగా ఎడిగినవారె క్రిమిలేయర్ ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. క్రిమిలేయర్ వ్యతిరేకించేవారు పేదలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి సూచన అయినా చేయాలన్నారు. 2024 సుప్రీంకోర్టు తీర్పు మోడీ తీర్పు అయితే 2004లో ఇచ్చిన తీర్పు సోనియాగాంధీ, మన్మోహన్ తిర్పా అన్నారు. సుప్రీంకోర్టును తప్పు పెట్టేలా వ్యాఖ్యలు చేయవద్దన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్పు పై మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు.. దాన్ని ఎవరు ఆపలేరన్నారు. దళితుల్లో కూడా సాంఘిక సమానత్వం లేదన్నారు. తెలంగాణలో మాదిగలకు ఒక్క సీటు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: నగరంలో జోయిటిస్ విస్తరణ.. సీఎం రేవంత్ తో కంపెనీ ప్రతినిధులు భేటీ