Site icon NTV Telugu

Sacrifice Incident: గుజరాత్‌లో దారుణం.. తలలు నరుక్కుని భార్యభర్తల బలి

Sacrifising Incident

Sacrifising Incident

Sacrifice Incident: గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య, భర్తలు తమ తలలను నరుక్కుని, తమను తాము బలి ఇచ్చుకున్నారు. ఇంట్లోనే గిలెటిన్ లాంటి పరికరాన్ని అమర్చుకుని తలలు తెగిపడేలా చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డరని పోలీసులు ఆదివారం వెల్లడించారు. మృతులు హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) వింఛియా గ్రామంలోని తమ పొలంలో ఉన్న గుడిసెలో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఆ గుడిసెలో బ్లేడ్ లాంటి ఆకారం(గిలెటిన్) పరికరాన్ని అమర్చుని తలలు తెగిపడేలా ఆత్మహత్యకు పాల్పడినట్లు వించియా పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇంద్రజీత్‌సిన్హ్ జడేజా తెలిపారు.

Read Also: Maharashtra: కారు ఆపమన్నందుకు..ఏకంగా ట్రాఫిక్ పోలీస్‌ని 10 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు..

భార్యభర్తలిద్దరు కావాలనే పథకం ప్రకారం ఇలా చేసినట్లు చేశారని, సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు. దంపతులు మొదటగా తమ తలలను తాడుకు కట్టుకుని గిలెటిన్ లాంటి పరికరం కింద పెట్టుకుని, తాడు వదలగానే తలలు తెగిపడేలా ప్లాన్ చేశారు. అక్కడే ఓ అగ్నితో బలిపీఠాన్ని సిద్ధం చేసుకున్నారు. తలలు తెగిపడగానే అగ్నిలోకి వెళ్లేలా సిద్ధం చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు సమాచారం ప్రచారం శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ బలికి సంబంధించిన పనులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అక్కడే సూసైడ్ నోట్ దొరికింది. గత ఏడాది కాలంగా వీరిద్దరు ప్రతీరోజు గుడిసెలో ప్రార్థనలు చేస్తున్నారని వీరి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుల ఇద్దరు పిల్లుల, తల్లిదండ్రులు, ఇతర బంధువులు సమీపంలోనే నివసిస్తున్నారు. ఆదివారం ఈ సంఘటన గురించి వారే సమాచారాన్ని అందించారు. సూసైడ్ నోట్ లో తమ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని బంధువులను కోరారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version