Site icon NTV Telugu

Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..

Delhi Incident 1

Delhi Incident 1

Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల మైనర్ ని దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో బాలిక హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ హత్యకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నిన్న ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని షహబాద్ డైరీ ప్రాంతంలో హత్య జరిగింది. ఈ హత్య ఉదంతం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తన ఇంటి వెలుపల కూర్చున్న బాలికపై విచక్షణారితంగా కత్తితో దాడి చేశాడు. 21 సార్లు పొడిచాడు. కత్తి తలతో ఇరుక్కుపోవడంతో బండరాయితో మోది హత్య చేశాడు. ఆ హత్యను ప్రజలు చూసుకుంటూ వెళ్లారు తప్పితే ఒక్కరూ కూడా ఆపలేదు. ఈ ఘటన తర్వాత నిందితుడు సాహిల్ అక్కడి నుంచి పరారయ్యాడు.

Read Also: Wrestlers Protest: జంతర్‌ మంతర్‌ దగ్గర నో పర్మిషన్‌… ట్విట్టర్‌లో పేర్కొన్న ఢిల్లీ పోలీసులు

20 ఏళ్ల సాహిల్ ఫ్రిజ్-ఏసీ రిపేర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. హత్య అనంతరం పారిపోయిన వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్ షహర్ లో అతడు పట్టుబడ్డాడు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏదో చర్య తీసుకోవాలని కోరారు. ఢిల్లీ మహిళ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ మహిళలకు సెఫ్టీ లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా.. ఈ ఉదంతాన్ని కేరళ స్టోరీ సినిమాతో ముడిపెట్టారు. ఢిల్లీలో ఎన్నో కేరళస్టోరీలు జరుతున్నాయని, శ్రద్ధావాకర్ కు న్యాయం జరగలేదని, ప్రస్తుతం మరో హిందూ బాలిక హత్యకు గురైందని అన్నారు.

Exit mobile version