NTV Telugu Site icon

Madhya Pradesh: యువకుడి ఆత్మహత్య.. కారణం తెలిస్తే ఇలా కూడా ఉంటారా అనుకోవడం పక్కా

Gun

Gun

Man who Running Hotel Business Commit Suicide after Reaching 30: ఎంత బలమైన కారణాలున్నా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. అలాంటి కొంత మంది చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. సమస్య ఏదైనా దాన్ని ఎదిరించి పోరాడి నిలబడగలగాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటాం. ఇక మధ్యప్రదేశ్ లో ఓ యువకుడి ఆత్మహత్య దానికి కారణాన్ని తెలుపుతూ అతడు రాసిన సూసైడ్ నోట్ చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. 30 ఏళ్లు వచ్చేశాయని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Also Read: Viral Video: కొరియన్ మహిళ ఇండియన్ పాటకు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసిందో చూశారా?
వివరాల ప్రకారం మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు తన రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. 2016 లో ఆ వ్యక్తి స్వీయ రక్షణ కోసం రివాల్వర్ తీసుకున్నాడు. పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందటంతో అక్కడి చేరుకున్న ఖాళీలు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి వద్ద నుంచి ఓ ఏడు పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న అంశాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి. ‘నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల ముందే 30 ఏళ్ల వరకే బతకాలనుకున్నాను. ఇప్పుడు నాకు ముప్పై ఏళ్లు వచ్చేశాయి. అందుకే చనిపోతున్నాను. నాకు ఎలాంటి కష్టాలు, బాధలు లేవు. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని ఆ సూసైడ్ నోట్ లో రాసి ఉంది.  అయితే ఆ వ్యక్తి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు నిజంగానే 30 ఏళ్ల వరకు బతికి చనిపోవాలనుకున్నాడా? లేదా అతని ఆత్మహత్య వెనుక మారేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఇక యువకుడి ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఆత్మహత్యకు గల కారాణాన్ని తెలుసుకొని చాలా మంది  ఇలా కూడా ఆత్మహత్య చేసుకుంటారా అని నోరెళ్లబెడుతున్నారు.