Railway Police Save Life: ప్రాణాలు పోయేవి.. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Police Save Life: రైల్వే స్టేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టాలు దాటే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్లు చేస్తూనే ఉంటారు. రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు పట్టాలపై జారిపడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. కేఆర్ పురం రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పట్టాలపై జారిపడిపోయాడు. ఫ్లాట్‌ఫాంపైకి తిరిగి రావడానికి ఆ వ్యక్తి కష్టపడడాన్ని చూసిన రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి సురక్షితంగా పైకి లాగారు. ఆ వ్యక్తిని లాగిన కొన్ని క్షణాల తర్వాత రైలు ఫ్లాట్‌ఫాంలోకి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో రైలు స్టేషన్‌కు చేరుకునేలోపే ప్రయాణికుడి ప్రాణం రక్షించబడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసులపై సోషల్ మీడియా వెబ్‌సైట్లలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
కొన్ని రోజుల క్రితం కూడా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వారణాసి కంటోన్మెంట్ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం, రైలు కోచ్ మధ్య గ్యాప్‌లో జారిపడిన మహిళను రైలు గేటు వద్ద నిలబడి ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కాపాడిన అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read
Prompt response by RPF personnel saved the precious life of a man who slipped and fell on tracks minutes before the arrival of a train at KR Puram Railway Station, Bengaluru. pic.twitter.com/P0CXy3JfvH
— Ministry of Railways (@RailMinIndia) July 16, 2022
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!