Site icon NTV Telugu

Railway Police Save Life: ప్రాణాలు పోయేవి.. వ్యక్తిని కాపాడిన రైల్వే పోలీసులు

Railway Police Save Life

Railway Police Save Life

Railway Police Save Life: రైల్వే స్టేషన్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టాలు దాటే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్లు చేస్తూనే ఉంటారు. రైలు వచ్చే కొన్ని క్షణాల ముందు పట్టాలపై జారిపడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు రక్షించారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురం రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా విడుదల చేసింది. కేఆర్ పురం రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి పట్టాలపై జారిపడిపోయాడు. ఫ్లాట్‌ఫాంపైకి తిరిగి రావడానికి ఆ వ్యక్తి కష్టపడడాన్ని చూసిన రైల్వే సిబ్బంది వేగంగా స్పందించి సురక్షితంగా పైకి లాగారు. ఆ వ్యక్తిని లాగిన కొన్ని క్షణాల తర్వాత రైలు ఫ్లాట్‌ఫాంలోకి వచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది త్వరితగతిన స్పందించడంతో రైలు స్టేషన్‌కు చేరుకునేలోపే ప్రయాణికుడి ప్రాణం రక్షించబడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఓ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడిన రైల్వే పోలీసులపై సోషల్ మీడియా వెబ్‌సైట్లలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

కొన్ని రోజుల క్రితం కూడా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వారణాసి కంటోన్మెంట్ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం, రైలు కోచ్ మధ్య గ్యాప్‌లో జారిపడిన మహిళను రైలు గేటు వద్ద నిలబడి ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది ఆమెను రక్షించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కాపాడిన అధికారులపై ప్రశంసల వర్షం కురిపించారు.

Exit mobile version