NTV Telugu Site icon

UP crocodile Video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ మొసలి.. జనాలు పరుగులు

Upcrocodilevideo

Upcrocodilevideo

ఉత్తరప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక మొసలి నివాసాల మధ్యకు వచ్చేసింది. దీంతో జనాలు హడలెత్తిపోయారు. మొసలి వెంట కుక్క పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. దీంతో స్థానికులు కూడా పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Yadu Vamsi Interview: ‘కమిటీ కుర్రోళ్లు’ షూట్ చేస్తుంటే పూనకాలు వచ్చాయి.. ఏమాత్రం ఊహించలేదు!

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లోని నివాస ప్రాంతంలో భారీ మొసలి కనిపించింది. కొందరు దాని వెంట పడడంతో రోడ్డుపై పరుగులు పెట్టింది. ఒక వ్యక్తి అయితే దాని తోకపై కాలుతో తన్నాడు. కుక్క కూడా అరవడంతో రోడ్డుపై వేగంగా పరుగులు తీసింది. మూడు గంటల పాటు స్థానికులను మొసలి హడలెత్తించింది. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని మొసలిని పట్టుకుని తీసుకెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున కుక్కలు అరవడంతో మొసలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 3 గంటల పాటు నంగల్ సోటి గ్రామంలో మొసలి కలియతిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు చూసేయండి.

ఇది కూడా చదవండి: Attempt to Murder: భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ చేసిన అక్క..

Show comments