Site icon NTV Telugu

Man plugs kettle in train: రైలులోని మొబైల్ ఛార్జింగ్ సాకెట్‌లో నీటిని మరిగించేందుకు కెటిల్ పెట్టాడు.. ఆ తర్వాత జరిగింది ఇది..

Train

Train

Man plugs kettle in train: కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడు తెలియక చేసిన తప్పిదం అతను అరెస్ట్ అయ్యేందుకు కారణమైంది. రైలులో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కోసం వాడే సాకెట్‌ని నీటిని వేడిచేసుకునేందుకు ఎలక్ట్రిక్ కెటిల్‌ కోసం వాడాడు. దీంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు.

Read Also: Maldives Row: భారత్‌తో వివాదం నేపథ్యంలో చైనా, జిన్‌పింగ్‌పై మాల్దీవ్స్ అధ్యక్షుడి ప్రశంసలు..

36 ఏళ్ల వ్యక్తి శనివారం గయా నుంచి న్యూఢిల్లీకి మహాబోధి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తు్న్నాడు. ఈ క్రమంలో వేడి నీటి కోసం కెటిల్‌ని మొబైల్ ఛార్జింగ్ పాయింట్‌లో ప్లగ్ చేశాడు. ఈ నేరానికి గానూ రైల్వే చట్టం సెక్షన్ 147(1) కింద కేసు నమోదు చేశారు. అలీఘర్ కోర్టు ముందు హాజరుపరిచారు. అతని చర్యకు రూ. 1000 జరిమానా విధించడంతో పాటు కోర్టు హెచ్చరించి వదిలిపెట్టింది.

రైలులో హై ఓల్టేజ్ పరికరాలు వాడటం నిశేధం. ఇది షార్ట్ సర్య్యూట్‌కి దారి తీసి రైలులో అగ్ని ప్రమాదానికి కారణం కావచ్చు. విచారణ సమయంలో సదరు వ్యక్తి మాట్లాడుతూ.. 70 ఏళ్ల వృద్ధ మహిళ మందులు వేసుకునేందుకు గోరువెచ్చని నీరు కావాల్సి వచ్చిందని, పాంట్రీ కార్ సిబ్బందిని అడిగితే ఇవ్వలేదని, తానే స్వయంగా నీటిని వేడి చేయాలని ఈ పనిచేసినట్లు చెప్పుకొచ్చారు.

Exit mobile version