Maharashtra: మేనకోడలు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పెళ్లి భోజనంలో విషం కలిపాడు. అయితే, అక్కడ ఉన్న వారు చూసి పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర కోల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆహారం ఎవరూ తినలేదని, పరీక్షల కోసం ఫుడ్ శాంపిల్స్ పంపాపని పోలీసులు బుధవారం తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Read Also: Chandrababu: మోడీ అంటే నమ్మకం, విశ్వాసం
ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం పన్హాలా తహసీల్ పరిధిలోని ఉట్రే గ్రామంలో జరిగింది. విషం కలిపిన నిందితుడిని ముందుగా పట్టుకున్నారు, అయితే ఆ తర్వాత వారి నుంచి పారిపోయాడు. పెళ్లికి హాజరైన వ్యక్తుల ప్రాణాలనకు హానికలిగించాడనే ఆరోపణలపై పన్హాలా పోలీసులు నిందితుడు మహేష్ పాటిల్‌పై కేసు నమోదు చేశారు.
వివరాల ప్రకారం.. పెళ్లి చేసుకున్న యువతి, తన మేనమామ అయిన మహేష్ పాటిల్ ఇంట్లోనే పెరిగింది. యువతి, వేరే వ్యక్తిని ప్రేమించి, పారిపోయి వివాహం చేసుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న సమయంలో, అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనంలో విషం కలిపాడు. పక్కన ఉన్న వారు ఆపేందుకు ప్రయత్నించారు. ఈ విషయం గురించి తెలిసీ ఎవరూ భోజనాలు చేయలేదు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.