Site icon NTV Telugu

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో బాలికపై పాడుపని.. నిందితుడి అరెస్ట్..

Delhi Metro

Delhi Metro

Delhi Metro: కొందరు వ్యక్తులు చేస్తున్న అసభ్యకరమైన పనుల వల్ల ఢిల్లీ మెట్రో తరుచుగా వార్తల్లో నిలుస్తోంది. కొంతమంది కామాంధులు అడ్డుఅదుపు లేకుండా మెట్రోలోనే పాడుపనులకు పాల్పడుతున్నారు. అందరూ ఉన్నారనే విషయాన్ని మరిచి, సభ్యసమాజం ఛీకొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.

Read Also: Bandi Sanjay: బండి సంజయ్ అమెరికా పర్యటన.. 10 రోజుల పాటు యూఎస్‌లోనే!

మరోసారి ఇలాంటి ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది డిల్లీ మెట్రో. ఓ వ్యక్తం మైనర్ బాలికను చూస్తూ హస్తప్రయోగం చేశాడు. సదరు వ్యక్తిని గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఢిల్లీ మెట్రోలోని ‘రెడ్ లైన్’లో చోటుచేసుకుంది.

బుధవారం రాఖీ పండగ సందర్భంగా మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆ సమయంలో కిక్కిరిసిన కోచ్ తో ఓ వ్యక్తి తన కూమార్తెపై స్కలనం చేసినట్లు బాలిక తల్లి గుర్తించింది. సీలంపూర్ స్టేషన్ లో దిగిపోయినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమబెంగాల్ కు చెందిన నిందితుడిని ఇద్దరు ప్రయాణికులు గుర్తించి పట్టుకుని షాహదారా స్టేషన్‌లో ఢిల్లీ మెట్రో అధికారులకు అప్పగించారు. అనంతరం స్టేషన్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Exit mobile version