Site icon NTV Telugu

దారుణం.. ఓటు వేసేందుకు నిరాకరించారని ఉమ్మి నాకించాడు

బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు నిరాకరించిన ఇద్దరు యువకుల చేత నేలపై ఉమ్మిని నాకించిన ఘటన ఔరంగాబాద్ జిల్లాలోని సింఘనా గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… పంచాయతీ ఎన్నికల్లో సింఘానా గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న బల్వంత్ సింగ్ అనే వ్యక్తి తనకు ఓటు వేయాలంటూ ఓటర్లను అభ్యర్థించాడు. అయితే ఇద్దరు యువకులు మాత్రం బల్వంత్ సింగ్‌కు ఓటు వేసేందుకు నిరాకరించారు. దీంతో బల్వంత్ సింగ్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.

Read Also: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఈపీఎఫ్‌వో.. ఖాతాల్లో జమ

దీంతో తన ముందే ఓటు వేసేది లేదంటూ తెగేసి చెప్పిన యువకులను బల్వంత్ సింగ్ దారుణంగా అవమానించాడు. నేలపై ఉమ్మి వేసి బలవంతంగా నాకించాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా నియంత తరహాలో ప్రవర్తించిన బల్వంత్ సింగ్‌పై స్థానికులు బాధితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ ఘటనపై విచారణ చేపట్టి బల్వంత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జిల్లా కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version