NTV Telugu Site icon

Mobile Phone Exploded: మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్..

Mobile Blast

Mobile Blast

Mobile Phone Explodes While Talking: ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల మాట్లాడుతుండగా పేలడం, ఛార్జింగ్ సమయంలో షాక్ తో పలువురు మరణించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పేలుడు సంభవించింది. దీంతో వ్యక్తి గాయపడ్డారు.

Read Also: Jaggery Eating: చలికాలంలో బెల్లాన్ని ఇలా తీసుకుంటే..

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహాలో హిమాన్షు అనే వ్యక్తి కాల్ లో ఉండగానే అతని మొబైల్ ఫోన్ పేలింది. నాలుగు నెలల క్రితమే రూ. 16,000లతో రియల్ మీ 8 మొబైల్ కొనుగోలు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనలో బాధితుడి చేతి వేళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.

హిమాన్షులోని అమ్రోహాలోని హిజాంపూర్ గ్రామ నివాసి, తాను 4 నెలల క్రితం ఆగస్టు 31, 2022న రూ. 16,000కి రియల్‌మే 8 మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ పేలి చేతివేళ్లకు గాయాలు అయ్యాయి. వేళ్లకు స్వల్ప గాయాలు కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డానని హిమాన్షు తెలిపాడు.

Show comments