Site icon NTV Telugu

Death Certificate: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన

Death Certificate

Death Certificate

Death Certificate: ఎవరైనా తమ స్టడీ సర్టిఫికెట్లు పోయాయని లేదా విలువైన ఆస్తి పత్రాలు పోయాయని పేపర్‌లో ప్రకటన ఇస్తుంటారు. కానీ డెత్ సర్టిఫికెట్ పోయిందని ఎవరైనా ప్రకటన ఇస్తారా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పేపర్‌లో ప్రకటన ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక వ్యక్తి ‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తన మరణ ధృవీకరణ పత్రం కోల్పోయాను.. సర్టిఫికెట్ సీరియల్ నెంబర్ ఫలానా.. ఎవరికైనా దొరికితే ప్లీజ్ తిరిగివ్వండి’ అని అభ్యర్థించారు. ఈ మేరకు ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఓ న్యూస్ పేపర్‌లో ప్రింట్ అయిన యాడ్‌ను ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పట్ల నెటిజన్లు వందలు, వేలల్లో కామెంట్లు, ఎమోజీలు, కామిక్ వీడియోలతో స్పందిస్తున్నారు.

Read Also:Mumbai: అర్ధరాత్రి నగ్నంగా వ్యక్తి హల్చల్.. రేపిస్టా..? సీరియల్ కిల్లరా..?

సాధారణంగా మనిషి చనిపోయిన తరువాతే మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దాంతో ఈ పోస్టుకు నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపించి కామెంట్లు పెడుతున్నారు. దొరికితే ఎక్కడికి తెచ్చివ్వాలి బ్రదర్.. నరకానికా? స్వర్గానికా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరో తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నారు. ఎవరికైనా దొరికితే వెంటనే తిరిగివ్వండి. ఇది చాలా అర్జెంట్. లేదంటే ఆ ఆత్మకు కోపం వస్తుంది అంటూ కొందరు ఛమత్కరిస్తున్నారు. కొందరు నెటిజన్‌లు మాత్రం చనిపోయిన వ్యక్తి కుమారుడు తన తండ్రి పేరుపై ఈ ప్రకటన ఇచ్చి ఉండవచ్చు అంటూ అభిప్రాయపడుతున్నారు. అయితే సదరు ప్రకటనలో ఆ వ్యక్తి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు తన ఇంటి అడ్రస్ కూడా ఇవ్వడం గమనించదగ్గ విషయం.

Exit mobile version