NTV Telugu Site icon

CM-PM In Garbage Cart: చెత్త బండిలో సీఎం, పీఎం..! వీడియో వైరల్‌..

Cm, Pm In Garbage Cart

Cm, Pm In Garbage Cart

చెత్త బండిలో యూపీ సీఎం యోగి, ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలను ఓమున్సిపల్‌ కార్మికుడు తీసుకెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లోని మధునగర్‌ నిగమ్‌ లో చోటుచేసుకుంది. ఒక కాంట్రాక్టు మున్సిపల్‌ కార్మికుడు తన చెత్త బండిలో ప్రధానిమంత్రి మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తో పాటు ఇతర ప్రముఖుల ఫోటోలను తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌కి చెందిన కొందరు వ్యక్తలు సదరు వ్యక్తిని ఆపి మరీ ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆ చెత్తబండిలో అబ్దుల్‌ కలాం పోటో కూడా ఉంది. దీంతో సదరు వ్యక్తిని ఏంటి ఇది అంటూ ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను పియూష్‌ రాయ్‌ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో కొద్దిసేపటికే వైరల్ గా మారింది.

read also: Aam Aadmi Party: కాంగ్రెస్, బీజేపీ ఖో-ఖో.. ఇక చెల్లదు పో.. అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. రాజస్థాన్‌లోనూ రాణిస్తుందా?

దీంతో చెత్తలో ఫోటోలను తీసుకెళ్తున్న కార్మికుడికి అడగగా తనకేమి తెలియదని, తన పని చెత్తను సేకరించుకుని తీసుకువెల్లడమేనని, దాంట్లో ఈ ఫోటోలు వున్నాయని తెలిపాడు. చెత్త కిందకు పడిపోకుండా ఈ ఫోటోలను అడ్డంగా పెట్టుకున్నానని వివరించాడు. అయితే ఈ ఘటనను అవమానంగా భావించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం సదరు మున్సిపాలిటీ కాంట్రాక్ట్‌ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. కాగా ప్రస్తుతం ఈవీడియో ఇప్పడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఇందులో అతని తప్పేముంది, చెత్త బుట్టలో ఉంటేనేగా అతను సేకరించాడు అంటూ కొందరు కామెంట్‌ చేస్తుంటే.. మరొకొందరు పాడైన ఫోటోలను ఏం చేయాలో చెప్పండి అంటూ ట్వీట్‌ చేశారు.