Man dragged on car bonnet for over a kilometre: బెంగళూరులో వృద్ధుడుని బైక్‌తో ఈడ్చుకెళ్లిన ఘటన మరవకముందే మరోసారి అలాంటి అమానుషం వెలుగులోకి వచ్చింది. తనతో వాగ్వాదం పెట్టుకున్నాడన్న కోపంతో ఓ వ్యక్తిని మహిళ తన కారు బానెట్‌పై కిలోమీటరు పాటు ఈడ్చుకెళ్లింది. బెంగళూరులోని జ్ఞాన భారతి నగర్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..ప్రియాంక అనే మహిళ కారు.. దర్శన్ అనే వ్యక్తి కారును ఢీకొట్టింది. దీనికి సంబంధించి అతడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే కారు నుంచి దిగిన వ్యక్తి.. ఆ మహిళ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా ఆమె స్పీడ్ పెంచి అతడిని ఢీకొట్టడంతో బానెట్‌పైకి దూకేశాడు. ఈ క్రమంలోనే ప్రియాంక అతడిని అలాగే కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఇదే విషయమై వెస్ట్ ట్రాఫిక్ డిప్యూటీ కమీషనర్ వివరణ ఇచ్చారు.
Greater Noida: యువతిపై సామూహిక అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్
“దర్శన్ కారును ప్రియాంక ఢీకొట్టింది. దీంతో కోపంతో ఆ వ్యక్తి ప్రియాంక కారును ఆపేందుకు ప్రయత్నించగా ఆమె అసభ్య సంకేతాన్ని చూపించి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అడ్డుగా ఉన్న దర్శన్‌పైకి కారు ఎక్కించే క్రమంలో అతడు కారు బానెట్‌పైకి దూకేశాడు. ఆపై ఆమె అలాగే కిలోమీటర్ వరకు కారును డ్రైవ్ చేసింది. ప్రియాంక కారు ఆపగానే.. దర్శన్, అతడి స్నేహితులు ఆమె కారుపై దాడిచేశారు. అనంతరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశాం” అని డీఎస్పీ వెల్లడించారు. ప్రియాంకపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదు కాగా, దర్శన్ అతడి స్నేహితులపై సెక్షన్ 354 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
John Abraham: చేయని తప్పుకి శిక్ష.. జాన్ అబ్రహంపై విమర్శలు
కాగా, మూడు రోజుల క్రితం ఇదే బెంగళూరులో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంతో ఓ వృద్ధుడి కారును ఢీకొట్టాడు. అంతటితో ఆగకుండా అక్కడినుంచి తప్పించుకునే యత్నంలో ఆయన్ను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఇటీవల ఢిల్లీలో ఓ యువతిని కారుతో ఢీకొట్టి, కొన్ని కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన చర్చనీయాంశమైన వేళ తాజా వ్యవహారం వెలుగు చూసింది. ఈ దారుణానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
