Man beats 12th wife to death in jharkhand: జార్ఖండ్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన భార్యను కొట్టి చంపాడు. ఇక్కడ విషయం ఏమిటంటే మరణించిన మహిళ, నిందితుడికి 12వ భార్య. వివారాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని గయాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్ దార్ పంచాయతీలోని తారాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Bandi v/s Ktr: కేటీఆర్‌కు బండి సంజయ్ సవాల్.. నీకు దమ్ముంటే ఆ సర్టిఫికెట్స్ బయటపెట్టు
రామచంద్ర తురి, సావిత్రీ దేవీ భార్యభర్తలు. ఆదివారం రాత్రి భార్యభర్తలు ఇద్దరు రూంలో కూర్చుని మందు తాగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య చిన్నగా మొదలైన వాగ్వాదం పెద్ద గొడవగా మారింది. కోపంతో ఊగిపోయిన రామచంద్ర, 40 ఏళ్ల సావిత్రీ దేవిని కట్టెతో చనిపోయేదాకా కొట్టాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పోలీసులకు ఫోన్ చేసి హత్య వివరాలను చెప్పారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు.
రామచంద్రకు ఇప్పటికే 11 మందితో వివాహం అయింది. అయితే భార్యలను తాగి కొడుతుండటంతో వారంత అతడిని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం మరణించి సావిత్రీ దేవీ 12వ భార్య. ఆమెకు ఇదివరకే పెళ్లైంది. రామచంద్రకు పిల్లలు లేరు. సావిత్రీకి ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉంది.
