Site icon NTV Telugu

Bomb Joke: లగేజీ బ్యాగ్‌లో బాంబు ఉందని జోక్ చేశాడు.. ఫ్లైట్ మిస్సయ్యాడు..

Bomb Joke At Airport

Bomb Joke At Airport

Bomb Joke: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దేవి అహల్యాబాయి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి తన బ్యాగ్‌లో బాంబు ఉందని జోక్‌ చేసిన పాపానికి అతనితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఫ్లైట్‌ మిస్ అవ్వాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్టులో అధికారులు అతనిని తీవ్రంగా ప్రశ్నించి.. తనిఖీలు చేయడమే కాదు.. రాతపూర్వక క్షమాపణలు సమర్పించేవరకు వదల్లేదు. ఈ నేపథ్యంలో కుటుంబం అంతా తమ ఫ్లైట్ మిస్సయ్యారు.

సోమవారం రాత్రి ఓ వ్యక్తి విమానాశ్రయానికి చేరుకుని భద్రతా తనిఖీలు చేస్తుండగా.. తన లగేజీలో బాంబు ఉందని సరదాగా చెప్పాడని, దీంతో ఏరోడ్రోమ్‌లోని అధికారులను అప్రమత్తం చేసినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సీవీ రవీంద్రన్ బుధవారం తెలిపారు.భద్రతా సిబ్బంది వారిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసి వారిని కూడా విచారించారని తెలిపారు. ఆ వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి ప్రయాణిస్తున్నాడు.

Basant Soren: లో దుస్తులు కొనేందుకు ఢిల్లీకి వెళ్లా.. ముఖ్యమంత్రి సోదరుడు వివాదాస్పద వ్యాఖ్యలు

విచారణ సమయంలో వ్యక్తి తన బాధ్యతారహిత చర్యకు క్షమాపణలు చెప్పాడు. అతని సామానులో అభ్యంతరకరమైనది ఏమీ కనుగొనబడలేదని రవీంద్రన్ చెప్పారు.అతడిని తనిఖీ చేయడం, ప్రశ్నల కారణంగా ముగ్గురూ తమ ఫ్లైట్‌ను కోల్పోయారు. ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సంజయ్ శుక్లా మాట్లాడుతూ.. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది ఆ వ్యక్తి వ్రాతపూర్వక క్షమాపణలు సమర్పించిన తర్వాతే కుటుంబాన్ని విమానాశ్రయం నుండి బయటకు వెళ్లడానికి అనుమతించారు. ఈ విషయాన్ని విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించలేదని తెలిపారు.

Exit mobile version