Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని హత్య చేస్తామని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని జింద్ జిల్లా దేవేరార్ గ్రామానికి చెందిన అజ్మీర్‌గా గుర్తించారు. జులానాలోని వాట్సాప్ గ్రూపులో హర్యానా ముఖ్యమంత్రిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అక్టోబర్ 08న హర్యానాలో ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో అజ్మీర్ వాట్సాప్ గ్రూపులో బెదిరించినట్లు జింద్ పోస్పీ సుమిత్ కుమార్ తెలిపారు.
Read Also: IND vs BAN 3rd T20: ఇదేం ఇరగ్గొట్టుడు గురూ.. 40 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసిన సంజు శాంసన్
ఈ విషయం పోలీసులు దృష్టికి వచ్చిన వెంటనే అజ్మీర్‌ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హర్యానాలోని జులానా నియోజకవర్గం ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, రెజ్లర్ వినేష్ ఫోగట్ పోటీ చేశారు. ఆమె తన ప్రత్యర్థి, బీజేపీకి పార్టీకి చెందిన యోగేష్ కుమార్‌ని 6015 ఓట్ల తేడాతో ఓడించారు. మొత్తంగా హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లను గెలుచుకుని మరోసారి అధికారం చేపట్టబోతోంది. మరోవైపు కాంగ్రెస్ 37 సీట్లకే పరమితమైంది. వరసగా మూడోసారి హర్యానా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. ఈ రాష్ట్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కి చివరకు నిరాశే మిగిలింది.