West Bengal Chief Minister: ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు దీదీ వెల్లడించారు. బెంగాల్‌లో సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె తెలిపారు. ఫలితాల తర్వాతే పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని దీదీ పేర్కొనింది. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఎన్నికల కోసం రాష్ట్రాల వారీగా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తాజాగా ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Mamata Banerjee: లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం..

Mamatha Benargee