Mamata Banerjee’s Cartoon Case: త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కార్టూన్ ను ఇతరులకు ఫార్వర్డ్ చేసినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై క్రిమినల్ కేసు నమోదు అయిన 11 ఏళ్ల తరువాత కోల్‌కతాలోని అలీపూర్ కోర్టు శుక్రవారం అతడిపై అభియోగాలను కొట్టేసింది. ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్రపై కోల్‌కతాలోని పుర్బా జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఏప్రిల్ 2012లో కేసు నమోదు అయింది. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కార్టూన్‌ను ఉద్దేశపూర్వకంగా ఈమెయిల్ ద్వారా కొంతమందికి ఫార్వార్డ్ చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం ఈ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Pakistan: బలూచిస్తాన్ లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన ట్రైన్.. 15 మంది..
దాదాపుగా 11 ఏళ్ల తరువాత ఆయనను నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును అలీపూర్ కోర్టు పక్కన పెట్టింది. అంబికేష్ మహాపాత్ర మమతాబెనర్జీ, టీఎంసీ నాయకులు ముకుల్ రాయ్ కార్టూన్లను ఇతరులకు పంపించాడు. దీనిపై ప్రొఫెసర్ పై పరువునష్టం కేసు దాఖలు అయింది. దాదాపుగా 11 ఏళ్ల న్యాయపోరాటం తరువాత ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బెంగాల్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, అధికార పార్టీ గూండాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి గొంతునైనా ఆపడానికి ఒక రకమైన కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
