కరోనాను కట్టడి చేసేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. భారత్‌లో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వెంటాడుతూనే ఉంది.. దీంతో.. 18 ఏళ్లు పైబడినవారికి ఇంకా వ్యాక్సినేషన్ ప్రారంభించలేదు.. అయితే, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోంది.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండో వ్యాక్సిన్లే కాకుండా మరికొన్ని వ్యాక్సిన్ల కూడా అనుమతి ఇచ్చింది.. అయితే, డిసెంబర్ చివరి నాటికి దేశంలో పౌరులందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇవి వట్టి గారడీ మాటలుగా కొట్టిపారేసిన ఆమె.. బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఊహాజనితంగా వ్యాక్సినేషన్ పై మాట్లాడుతోందని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ పై నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ.. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరాల్లోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు దీదీ.
2021 వ్యాక్సినేషన్ పూర్తి చేస్తారా? ఎలా సాధ్యం..?
Mamata Banerjee