Site icon NTV Telugu

Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ

Mamata Counter To Amit Shah

Mamata Counter To Amit Shah

Mamata Banerjee Gives Strong Counter To Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తాజాగా INDIA కూటమిలో ప్రధాన సభ్యురాలైన మమతా బెనర్జీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రెవేశపెట్టిన సమయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని సమర్థిస్తూనే.. ఊహించని షాకిచ్చారు. మీ INDIA కూటమి గురించి కాకుండా ఢిల్లీ గురించి ఆలోచించమని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోడీనే అధికారంలోకి వస్తారన్న లోక్‌సభలో అమిత్ షా వ్యాఖ్యానించగా.. ఆయన చెప్పింది కరెక్టేనంటూ మమతా కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలోనే పార్లమెంట్ ఉంది కాబట్టి.. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. అమిత్ షా తెలిసి అన్నారో, తెలియక అన్నారో తెలీదు కానీ.. రాబోయే ఎన్నికల్లో ఢిల్లీలో అధికారం INDIA కూటమిదేనన్నారు. మాతృభూమిని కాపాడుకోవడం కోసమే ఈ కూటమి ఏర్పడిందని అన్నారు. తమ INDIA కూటమి కొత్తదే అయినా.. దేశవ్యాప్తంగా తమకు ఉనికి ఉందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.

Rudraprayag Rain: భారీ వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది గల్లంతు

NDA కూటమి బలహీనమైందని.. అందులోని సభ్యులు కూటమిని విడిచిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయారని చెప్పారు. నిరుద్యోగ సమస్య పెరిగి దేశం మరింత దయనీయ స్థితికి చేరకుండా, మతపరమైన విద్వేషాలు చెలరేగకుండా ఉండాలంటే.. తమ INDIA కూటమి అధికారంలోకి రావాల్సిందేనని నొక్కివక్కాణించారు. వారు దేశమంతా కాషాయమయం చేసేస్తామని అంటున్నారని.. తమకు కూడా కాషాయమంటే ఇష్టమని, కానీ మిగతా రంగుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వాళ్లు కేవలం హింసనే ఎంచుకుంటున్నారని మండిపడ్డారు. కాషాయం మన హిందు దేవుళ్లకు, త్యాగానికి సంబంధించిన దివ్యమైన రంగు అని.. ఒకవేళ ఈ రంగుని వాళ్లు హింస కోసం వినియోగిస్తే.. దాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని వెల్లడించారు. టెర్రర్ సృష్టించడం వారి సాంప్రదాయమని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు చిత్రహింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రిపోర్టర్లను కూడా ‘నువ్వు హిందువా? ముస్లిమా?’ అని అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హింస తప్ప వేరే మార్గం లేదని వారు అనుకుంటున్నారని మమతా ధ్వజమెత్తారు.
Central Jail: సెంట్రల్ జైలులో మత్తు పదార్థాల కలకలం.. ఖైదీలకు చేరవేస్తున్న నిందితుడు అరెస్ట్

Exit mobile version