Site icon NTV Telugu

Mamata Banerjee: 2024 ఎన్నికల్లో గెలిచేది లేదు.. బీజేపీకి ‘నో ఎంట్రీ’నే

Cm Mamata Banerjee 1280

Cm Mamata Banerjee 1280

బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని, 2024 ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పురూలియాలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించార. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోదని జోస్యం చెప్పారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ‘కల్తీ’గా అభివర్ణించారు. నోట్ల రద్దు, కేంద్ర ఎజెన్సీలతో ప్రతిపక్షాలపై దాడులు చేయడం వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని దీదీ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ‘ నో ఎంట్రీ’ ఉంటుదని ఆమె అన్నారు. నోట్ల రద్దు వంటి వినాశకరమైన నిర్ణయాలు తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందిని.. ఇది పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.

బెంగాల్ లో అభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదిగా సాగడానికి కారణం కేంద్రం, బెంగాల్ కు కేంద్ర బాకాయిలు ఇప్పకపోవడమే అని ఆరోపించారు. దీని కోసం కింది స్థాయి నుంచి ఆందోళలు రావాలని.. స్థానిక బీజేపీ నేతలపై ఒత్తడి పెంచాలని.. అప్పుడే కేంద్రం నుంచి నిధులు వస్తాయిని ఆమె పిలుపునిచ్చారు. దేశంలోని పౌరులు కేంద్రంలోని ప్రజావ్యతిరేఖ ప్రభుత్వంతో విసిగిపోయారని అన్నారు. 2024లో బీజేపీకి అవకాశం ఉండదని స్పష్టంగా చెబుతున్నానని.. బీజేపీ వెళ్లిపోవాల్సిందే అని.. మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని మమతా బెనర్జీ అన్నారు.

Exit mobile version