Site icon NTV Telugu

Mallikarjun Kharge: కాంగ్రెస్ కార్యకర్తలకు భారత్ జోడో యాత్ర “సంజీవిని”

Congress

Congress

Mallikarjuna Kharge’s comments on Bharat Jodo Yatra: భారతదేశ ఆలోచనలు సవాల్ చేయబడుతున్నాయని.. ద్వేషానికి వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరూ ఏకం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయంలో పార్టీ జెండాను ఎగరేశారు. అందర్నీ కలుపుకుని వెళ్లే కాంగ్రెస్ విధానం వల్లే భారతదేశం పురోగమిస్తోందని అన్నారు. భారతదేశమ బలమైన ప్రజాస్వామ్య దేశంగా అవతరించడమే కాకుండా కొన్ని దశాబ్ధాల్లో ఆర్థిక, అణు, వ్యూహాత్మక రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆయన అన్నారు. అయితే ఇదంత తనంతటతానుగా జరగలేదని.. కాంగ్రెస్ పార్టీకి సమ్మిళిత సిద్ధాంత, సమాన హక్కులు, రాజ్యాంగంపై ఉన్న నమ్మకం వల్లే ఇందతా జరిగిందని ఆయన అన్నారు.

Read Also: Russia: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం..

భారతదేశ ప్రాథమిక అంశాలపై బీజేపీ నిరంతరం దాడి చేస్తుందని విమర్శించారు. విద్వేషంతో సమాజం చీలిపోయిందని.. ధరలు పెరుగుదల, నిరుద్యోగంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు సమాజంలోని అణగారిన వర్గాలను ఏకం చేసి.. ధరలపెరుగుదల, నిరుద్యోగం, ద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడోొ యాత్ర కాంగ్రెస్ కార్యకర్తలకు సంజీవిని వంటిదని అన్నారు. ఈ యాత్రకు దేశ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రత్యర్థులను ఉలిక్కిపడేలా చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ సత్యం, అహింస మార్గాన్ని ఎంచుకున్నానని.. ప్రజా సంక్షేమం కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నానంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Exit mobile version