NTV Telugu Site icon

Mallikarjun Kharge: సభ అంతరాయాలకు రాజ్యసభ ఛైర్మనే కారణం

Mallikarjunkharge

Mallikarjunkharge

రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్ వ్యవహారశైలి కారణంగానే సభలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. ఇండియా కూటమి నేతలతో కలిసి ఖర్గే మీడియాతో మాట్లాడారు. అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ.. ప్రతిపక్షాన్ని చిన్నచూపు చూస్తు్న్నారని ఖర్గే ధ్వజమెత్తారు. ఛైర్మన్ వ్యవహారశైలి కారణంగానే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వచ్చిందని ఖర్గే చెప్పుకొచ్చారు. ఛైర్మన్ ప్రవర్తన గౌరవప్రదంగా లేదన్నారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారని.. ప్రభుత్వాన్ని మాత్రం ప్రశంసిస్తున్నారని ఆరోపించారు.రాజ్యసభ ఛైర్మన్‌ ఓ పాఠశాల హెడ్‌మాస్టర్‌లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలను మాట్లాడనీయకుండా నిలువరిస్తున్నారని పేర్కొన్నారు. ఛైర్మన్‌పై ఎలాంటి వ్యతిరేకత లేనప్పటికీ ఆయన తీరుతో విసిగిపోయామని చెప్పారు. అందుకే ఆయన్ను తొలగించేందుకు నోటీసులతో ముందుకెళ్లడం మినహా వేరే మార్గం లేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వివరించారు.

ఇది కూడా చదవండి: DCP Narasimha : ఒకటి రెండు కాదు.. ఏకంగా 1100 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం

ఛైర్మన్ ప్రవర్తన ఆర్ఎస్ఎస్ మాదిరిగా ఉందని.. దేశ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వెల్లడించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఛైర్మన్ ఇలా దుస్థితిని తీసుకొచ్చారని తెలిపారు. కేవలం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అవిశ్వాస తీర్మానానికి పూనుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షం నుంచి నిబంధనల ప్రకారం ముఖ్యమైన అంశాలు లేవనెత్తినప్పుడల్లా ప్రణాళికాబద్ధంగా చర్చలు జరపడానికి ఛైర్మన్ అనుమతించడం లేదన్నారు. రాజ్యాంగ సంప్రదాయానికి బదులుగా ఆర్‌ఎస్ఎస్ మెప్పు కోసం.. తదుపరి ప్రమోషన్ కోసం ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఛైర్మన్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Heart Attack For Student: తరగతి గదిలోనే హార్ట్ ఎటాక్‌తో కుప్ప కూలిన బాలిక (వీడియో)

మంగళవారం రాజ్యసభ ఛైర్మన్‌పై ఇండియా కూటమి నేతలు అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. దాదాపు 50 మంది ఎంపీలు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ పార్టీ సహా కూటమిలో ఉన్న ఎంపీలంతా సంతకాలు చేశారు. ఛైర్మన్ పక్షపాతం చూపిస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు.