Site icon NTV Telugu

Mallikarjun Kharge: మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదు.. గవాయ్‌పై దాడిని ఖండించిన ఖర్గే

Mallikarjun Kharge

Mallikarjun Kharge

మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులు సరికాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ బీఆర్.గవాయ్‌పై దాడికి యత్నించడానికి ఖర్గే ఖండించారు. ఇటీవల అస్వస్థతకు గురై ఖర్గే కోలుకున్నారు. బుధవారం బెంగళూరులో ఖర్గే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గవాయ్‌పై దాడి ఘటనను తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టులో సీజేఐపై దాడికి యత్నించిన వ్యక్తులను న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఖండించాలన్నారు. మనుస్మృతి, సనాతన ధర్మం పేరుతో దాడులకు పాల్పడే వారిని విద్యావంతులను చేయాలని కోరారు. సమాజంలో అనవసరమైన ఉద్రిక్తతను వ్యాప్తి చేయడానికి, శాంతికి భంగం కలిగించడానికి ప్రయత్నించే వారిని విద్యావంతులను చేసి జవాబుదారీగా ఉంచాలని తెలిపారు.

ఇది కూడా చదవండి: Singer Rajvir Jawanda: పంజాబ్ గాయకుడు రాజ్‌వీర్ జవాండా కన్నుమూత

సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై వృద్ధా న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకుని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని రక్షించాలంటూ పదే పదే నినాదాలు చేశాడు. సనాతన ధర్మానాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశాడు. ఈ పరిణామంతో కోర్టు ప్రాంగణం అవాక్కైంది. ఇక ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని.. యథావిధిగా కార్యక్రమాలను గవాయ్ కొనసాగించారు. గవాయ్‌పై దాడిని ప్రధాని మోడీ సహా రాజకీయ పార్టీలన్నీ ఖండించాయి.

ఇది కూడా చదవండి: H1B Visa: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్‌లో తగ్గిన ఎన్నారై వరుల డిమాండ్..!

ఇదిలా ఉంటే నిందితుడు రాకేష్ కిషోర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో 3 గంటల పాటు విచారించి వదిలిపెట్టేశారు. రాకేష్ కిషోర్‌ కోర్టు నంబర్- 1లోకి ప్రవేశించి గవాయ్ నేతృత్వంలోని బెంచ్‌పై షూ విసిరేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. దాడి సమయంలో ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేగా హిందుస్థాన్’’ అని నినాదాలు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల పొడవున్న విష్ణువు విగ్రహం శిరచ్ఛేదం చేయబడిన నిర్మాణాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సీజేఐ గవాయ్ నిర్ణయం తీసుకోవడంపై నిందితుడు ఆగ్రహంగా ఉన్నాడు.

 

Exit mobile version