NTV Telugu Site icon

Priyanka Gandhi: సోదాల పేరుతో మహిళల గదిల్లోకి పోలీసులు వెళ్లడమేంటి?

Priya

Priya

కేరళ పోలీసుల తీరుపై కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ అభ్యర్థి ప్రియాంకాగాంధీ ధ్వజమెత్తారు. తనిఖీల పేరుతో పార్టీ మహిళా నేతలు ఉన్న గదుల్లోకి ప్రవేశించడం సరికాదంటూ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆమె పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించారు. వయనాడ్‌, పాలక్కాడ్‌లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మహిళా నేతలు పాలక్కాడ్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. ఒక కాంగ్రెస్‌ కార్యకర్త బ్యాగ్‌తో లోపలికి ప్రవేశించారు. ఇదంతా సీసీటీవీలో రికార్డు కావడంతో అనుమానాలకు దారి తీసింది. ఎన్నికల వేళ నల్లధనాన్ని తీసుకువెళుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: రైస్‌ మిల్లులలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వ ఆదేశాలతో సోదాలు నిర్వహించేందుకు పోలీసులు హోటల్‌కి వెళ్లారు. దీనిపై తాజాగా స్పందించిన ప్రియాంక గాంధీ.. పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. సోదాల పేరుతో అర్ధరాత్రి వేళ మహిళలు ఉన్న గదుల్లోకి వెళ్లడం చాలా పెద్ద తప్పు అన్నారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. వయనాడ్‌, పాలక్కాడ్‌లో ఉపఎన్నిక నవంబర్ 20న జరనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth: రేపు మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్రలో పాల్గొననున్న సీఎం..

Show comments