Site icon NTV Telugu

Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన

Actor Rinianngeorge

Actor Rinianngeorge

కేరళలో మలయాళ నటి రిని ఆన్ జార్జ్.. ఓ యువ రాజకీయ నాయకుడిపై చేసిన ఆరోపణలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్‌కు రమ్ముంటున్నాడని.. అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. ఆ పోస్ట్‌లో ఎక్కడా కూడా యువ నాయకుడి పేరు ప్రస్తావించలేదు.

కానీ బీజేపీ మాత్రం పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తక్షణమే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్ రాజీనామా చేయాలని బీజేపీ మార్చ్ నిర్వహించింది. రాహుల్ మమ్‌కూటథిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Karnataka: కర్ణాటకలో దారుణం.. ప్రేమ తిరస్కరించిందని స్నేహితురాలు హత్య

ఇదిలా ఉంటే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మమ్‌కూటథిల్‌పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశాడని తెలిపింది. సోషల్ మీడియాలో పదే పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది.

ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్‌లో మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా ఆరోపణలతో యువ నాయకుడిపై చర్యలు తీసుకునేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Rekha Gupta Attacked: ఆ ఆదేశాలతో ఢిల్లీకి వెళ్లా.. కానీ రేఖా గుప్తా పట్టించుకోలేదు.. నిందితుడు వెల్లడి

Exit mobile version