Site icon NTV Telugu

Earthquake: త్వరలో హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ భూకంపాలకు అవకాశం..

Earthquake

Earthquake

Earthquake: టర్కీలో భారీ భూకంపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. టర్కీతో పాటు సిరియాతో కలిపి ఇప్పటి వరకు 47 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మనదేశంలో కూడా ఇలాంటి భూకంపం తప్పదని చాలా మంది భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా హిమాలయ రాష్ట్రాలు ఎక్కువ రిస్క్ జోన్ లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో త్వరలోనే భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని ప్రముఖ శాస్త్రవేత్త, భూకంప నిపుణులు డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు వెల్లడించారు.

Read Also: Air India order support US jobs: బోయింగ్‌కి ఎయిరిండియా ఆర్డర్‌ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్‌

ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ ప్రతీ ఏడాది ఉత్తరంగా 5 సెంటీమీటర్ల ముందుకు వెళ్తోంది. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ క్రమంగా ఆసియా ప్లేట్ ను ముందుకు నెడుతోంది. దీంతో హిమాలయాలపై తీవ్ర ఒత్తడి పెరుగుతోంది. దీంతో భవిష్యత్తులో భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అంచనా వేశారు. ఉత్తరాఖండ్ లో 18 సిస్మోగ్రాఫ్ స్టేషన్లతో కూడిన బలమైన నెట్వర్క్ మాకు ఉందని తెలిపారు. హిమాచల్, ఉత్తరాఖండా, నేపాల్ పశ్చిమ ప్రాంతాల్లో భూకంపాలు ఎప్పుడైనా సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాంతాల్లో చాలా తరుచుగా స్వల్ప తీవ్రతతో భూకంపాలు వస్తుంటాయి. సోమవారం హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు ఉత్తరాన 56 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి 10.38 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

భూఉపరితలం మొత్తం 15 టెక్టానిక్ పలకలతో నిర్మితం అయిఉంది. ఇవి కదులుతూ ఉంటాయి. హిమాలయాల పుట్టుక కూడా టెక్టానిక్ ప్లేట్లు ఢీకొనడం వల్లే జరిగింది. తాజాగా టర్కీలో వచ్చిన భూకంపం కూడా టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్లే జరిగింది. అనటోలియన్ ప్లేట్ పై ఉండే టర్కీ భూభాగాన్ని అరేబియన్ టెక్టానిక్ ప్లేట్ ఢీకొట్టడం వల్లే భారీ భూకంపం సంభవించింది.

Exit mobile version