Mahindra XEV 9S: మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాల్లో తన జోరును పెంచింది. తన EV పోర్ట్‌ఫోలియోలో కొత్త అధ్యాయనానికి తెర తీసింది. నవంబర్ 27, 2025న తన న్యూ XEV 9S ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. బెంగళూర్‌లో జరిగే బ్రాండ్ ‘‘స్కీమ్ ఎలక్ట్రిక్’’ వార్షికోత్సవ కార్యక్రమంలో దీనిని లాంచ్ చేయనున్నారు.
Read Also: Nizamabad: మహిళ నగ్న మృతదేహం కేసు.. ఇప్పటికీ దొరకని తల.. రంగంలోకి 12 టీంలు..
XEV 9S మహీంద్రా కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ 7-సీటర్. ఇది మహీంద్రా INGLO ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైంది. పెట్రోల్, డీజిల్ కార్ ప్లాట్‌ఫామ్‌పై కాకుండా, పూర్తిగా ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఈ కారు నిర్మితమైనట్లు మహీంద్రా చెప్పింది. దీని ఫలితంగానే ఫ్లాట్-ఫ్లోర్ లేఅవుట్, వీల్‌బేస్ ఎక్కువగా ఉండటం, సౌకర్యవంతమైన సెకండ్-రో సీటింగ్, థర్డ్-రోకు వెళ్లేందుకు సులువైన యాక్సెసిబిలిటీతో క్యాబిన్ విశాలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.
స్పెసిఫికేషన్లను వెల్లడించనప్పటికీ మహీంద్రా వెల్లడించనప్పటికీ, XEV 9S కారును అనేక సార్లు టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ SUVలో కనెక్టెడ్ LED లైటింగ్, XEV 9eలో కనిపించే 3-స్క్రీన్ డిజిటల్ డాష్‌బోర్డ్ సెటప్‌తో సహా మహీంద్రా సరికొత్త ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బ్యాటరీ, పవర్ ట్రెయిన్ వివరాలను కంపెనీ పంచుకోలేదు. 500 కి.మీ రేంజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రియర్ వీల్స్ లేదా ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో సహా అనేక వేరియంట్లు ఉండొచ్చు.
