మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. క్షణికావేశంలో ఒక మహిళా వైద్యురాలు ఆస్పత్రిలోనే ప్రాణాలు తీసుకుంది. సతారాలోని జిల్లా ఆస్పత్రిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంపద ముండే అనే మహిళా వైద్యురాలు జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యురాలిపై శాఖాపరమైన విచారణకు పైఅధికారులు ఆదేశించారు. ఈ పరిణామంపై ఆమె మనస్తాపానికి గురైంది. తనపై అన్యాయంగా విచారణ జరుపుతున్నారంటూ వాపోయింది. దీంతో సీనియర్ ఆఫీసర్‌ను కలిసి తనపై విచారణ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అన్నట్టుగా వైద్యురాలు తీవ్ర నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ఆస్పత్రిలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
ఇది కూడా చదవండి: Kerala: ‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.. ప్రకటించనున్న సీఎం పినరయి
సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో తలెత్తిన విభేదాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివరణాత్మక దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. ఇరుపక్షాల మధ్య ఏం జరిగిందో విచారణ చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
