మహారాష్ట్ర లో దారుణం జరిగింది. గడ్చిరోలి జిల్లాలో SRPF జవాన్ల మధ్యలో ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ ఘర్షణ కాస్త ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆవేశంతో సహఉద్యోగి పై తన రివాల్వర్ త్ కాల్చిచంపాడు. తరువాత తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘర్షణలో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. అహేరి తహసీల్ పరిధిలోని మర్పల్లి పోలీసు క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై సబ్ డివిజనల్ పోలీసు అధికారి సుజిత్ కుమార్ క్షీరసాగర్ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ప్రజలను కాపాడ్సిన SRPF జవాన్ లే సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు కాల్చుచేసుకోవడంపై చర్చకు దారితీసింది. అసలు జవాన్ల మధ్య ఘర్షణకు దారితీసేంతగా ఏంజరిగిందని ప్రశ్నించుకుంటున్నారు. ఒకరిపై ఒకరు కాల్చుకునే పరిస్థితులు వచ్చాయంటే అక్కడ ఎవరు లేరా అంటూ ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. క్షనికావేశంలో ప్రాణాలు సైతం తీసుకునేంతగా వచ్చిందంటే వీరిమధ్య అంతగా ఏంజరిగిందే సమాలోచనలో పడ్డారు పై అధికారులు దీనిపై విచారణ చేపట్టారు.
Chandrababu Naidu: చిత్తూరులో పార్టీ పటిష్టతపై ఫోకస్.. హద్దు దాటితే ఖబడ్దార్
