Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Maharashtra Political Crisis Eknath Shinde Won The Trust Vote

Maharashtra Political Crisis: బలపరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే.. ఉద్ధవ్ వర్గం నుంచి పెరిగిన సపోర్ట్

Published Date :July 4, 2022 , 11:57 am
By Venu Goapl Reddy
Maharashtra Political Crisis: బలపరీక్షలో నెగ్గిన ఏక్ నాథ్ షిండే.. ఉద్ధవ్ వర్గం నుంచి పెరిగిన సపోర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహారాష్ట్ర సంక్షోభం దాదాపుగా ముగిసింది. తాజాగా ఈ రోజు జరిగిన బలనిరూపనలో  సీఎం ఏక్ నాథ్ షిండే తన మెజారిటీని నిరూపించుకున్నారు. దీంతో బీజేపీ, ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మహారాష్ట్రను మరో రెండున్నరేళ్ల పాటు పాలించనుంది. విశ్వాస పరీక్షలో ఏక్ నాథ్ షిండేకు మద్దతుగా 164 ఓట్లు వచ్చాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహాారాష్ట్రలో 144 మెజారిటీ కావాలి. అయితే దీని కన్నా 20 మంది సపోర్ట్ షిండే వర్గం సాధించింది. షిండే ప్రభుత్వానికి 99 ఓట్లు వ్యతిరేకంగా రాగా.. ముగ్గురు ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు దూరంగా ఉన్నారు.

దీంతో పాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా నిలిచారు. నిన్నటి వరకు ఉద్ధవ్ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు సంతోష్ బంగర్, శ్యాంసుందర్ షిండేలు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరింత డీలా పడినట్లు అయింది. బలనిరూపణ కోసం ప్రత్యేకంగా సమావేశం అయిన మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే సుధీర్ మునిగంటి వార్, శివసేన ఎమ్మెల్యే భరత్ గోగావాలే విశ్వాస పరీక్షకు ప్రతిపాదించారు. దీంతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను లెక్కపెట్టి మెజారిటీ తేల్చారు.

Read Also:Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌.. ఆన్‌లైన్‌లోనే ఉన్నా ఎవ్వరికీ తెలియదు

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే గ్రూపును శివసేన విప్ ను గుర్తిస్తూ కొత్తగా నియమించిన అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ నిర్ణయం తీసుకోవడాన్ని శివసేన ఉద్ధవ్ వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఠాక్రే వర్గం తరుపును సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ సుప్రీం కోర్టులో తన వాదనలు వినిపించారు. కొత్తగా వచ్చిన స్పీకర్ విప్ ను గుర్తించే అధికారం లేదని.. ఈ చర్య సుప్రీం కోర్టు విచారణ యథాస్థితిని మారుస్తుందని వాదించారు. అయితే మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై దాఖలైన అన్ని పిటిషన్లను ఈనెల 11న విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aharashtra Political Crisis
  • CM Eknath shinde
  • ShivSena
  • Trust Vote
  • Uddhav Thackeray

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions