Site icon NTV Telugu

Maharashtra CM Post: ఈ రాత్రికే సీఎం పేరు ప్రకటన! ప్రమాణస్వీకారం ఎప్పుడంటే..!

Mahacm

Mahacm

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. పైగా మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకుంది. ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు. కానీ ఎన్డీఏ కూటమి మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. మహాయుతి కూటమి (బీజేపీ, శివసేన, ఎన్సీపీ)లో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన.. బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్‌కుమార్‌లాగానే షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీకి మెజార్టీ లేకపోయినా సీఎంగా కొనసాగుతున్నారు. అదే పద్ధతిని మహారాష్ట్రలో అమలు చేయాలని శివసేన డిమాండ్ చేస్తోంది. కానీ బీజేపీ 132 అసెంబ్లీ సీట్లు సాధించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పోస్టు.. కమలనాథులే దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇలా ఇరు పార్టీల మధ్య తర్జన భర్జనతో పంచాయితీ ఎటు తెగకుండా నాన్చుడి సాగుతోంది. మరోవైపు అలకతో షిండే తన సొంతూరు వెళ్లిపోయారు. సతారా జిల్లాలోని తన స్వగ్రామమైన డేర్‌కు వెళ్లారు.

ఇది కూడా చదవండి: Telangana: విద్యుత్‌ రంగంలో కొత్త విప్లవం.. అర కోటి పేద కుటుంబాల్లో గృహజ్యోతి

ఇదిలా ఉంటే ఈ అర్ధరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు శివసేన నేత సంజయ్ శిర్సత్ అన్నారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ప్రధాని మోడీ, అమిత్ షా నిర్ణయించారని… ఈరోజు అర్ధరాత్రిలోగా సీఎం పేరు ప్రకటిస్తారని పేర్కొన్నారు. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: KTR: చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..!

Exit mobile version