మహారాష్ట్రలో రోజు రోజులు కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై లోకన్ ట్రైన్ లలో ప్రయాణికులు మాస్క్ తప్పని సరిగా ధరించాలని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సబర్బన్ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాస్క్ తప్పక ధరించాలని సీఎం ఉద్ధవ్ థాక్రే వివరించారు. ఆయన సీనియర్ ప్రభుత్వ అధికారులతో కరోనా పరిస్థితి పై శుక్రవారం చర్చలు జరిపారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముంబై సబర్బన్ లో మళ్ళీ ముఖానికి మాస్క్ లు తప్పని సరిగా ఉపయోగించాలని కోరారు. ముంబై లోని మెట్రోపాలిటన్ రీజియన్ లో కొరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగకుండా.. అరికట్టడానికి ఒక చర్యగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని తెలిపారు. అయితే.. ఏప్రిల్ ప్రారంభంలో మహారాష్ట్ర ప్రభుత్వంగ మాస్క్ తప్పనిసరి అనే నియమాన్ని తీసివేసింది. కాగా.. మహారాష్ట్రలోని ముంబై, థానే, పూణే, రాయ్‌గఢ్, పాల్ఘార్ జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపత్యంలో.. ప్రజలు తమంతట తాముగా కొవిడ్-19-మార్గదర్శకాలు అనుసరించాలని సీఎం ఈ సందర్భంగా కోరారు.
అయితే శుక్రవారం ఒక్క రోజే మహారాష్ట్రలో 4,205 కొత్త కొవిడ్-19 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. 5,000 మార్కును దాటిన ఒక రోజు తర్వాత కొత్త కేసుల్లో ఒక్క ముంబైలోనే 1,898 ఇన్ఫెక్షన్లు కేసులు రావడంతో భయాందోలనకు గురవుతున్నారు. అయితే ఇప్పటికి మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 25,000 దాటింది.
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ క్లైమాక్స్ ఫైట్.. మేకింగ్ వీడియో చూస్తే అబ్బా అనాల్సిందే..
