మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయం పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి.. తిరిగి ఆరు నెలల తర్వాత ఇంత ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం అంటే 49 స్థానాల్లోనే ఇండియా కూటమి గెలుచుకుంది. ఈ ఓటమిని ఏ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా దీనిపై న్యాయ పోరాటం చేయాలని మహా వికాస్ అఘాడీ నేతలు నిర్ణయానికి వచ్చారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో న్యాయపోరాటం చేసేందుకు సిద్ధపడుతోంది. ఈ మేరకు న్యాయ నిపుణులను కూటమి నేతలు కలిశారు. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Cyclone Alert for AP: ఏపీకి తుఫాన్ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కూడా.. ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ ఆరోపించారు. అమెరికా తరహాలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. తాజాగా మహారాష్ట్రలో ఓడిపోయిన తర్వాత డిమాండ్ మళ్లీ తెరపైకి తెచ్చారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరిపించాలంటూ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka: నిర్మల్ ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి.. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 288 స్థానాలకు గాను 132 స్థానాలు గెలుచుకుంది. ఇన్ని సీట్లు గెలుచుకోవడానికి ఈవీఎంల హ్యాక్ చేయడం వల్లే సాధ్యమైందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేపథ్యంలోనే ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్ పార్టీలు.. తిరిగి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆందోళనలు చేయాలని డిసైడ్ అవుతున్నారు.
తాజా ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమిలో ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ పార్టీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. థాక్రే 95 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాలు, కాంగ్రెస్ 101 స్థానాల్లో పోటీ చేస్తే 16 స్థానాలే గెలుచుకున్నాయి. ఇంత భారీగా ఓడిపోవడమేంటో అర్థం కావడం లేదని తర్జనభర్జన పడుతోంది.
ఇది కూడా చదవండి: Australia Cricket: క్రికెట్ మైదానంలో ఏడ్చేసిన సీన్ అబాట్.. కారణమిదే..?