Maharashtra: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మారస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేరు మార్పు గురించి కొన్ని నెలల క్రితం సూచనలను, అభ్యంతరాలను పరిశీలించి సబ్ డివిజన్, గ్రామ, తాలూకా, జిల్లా స్థాయిల్లో పేర్లను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం రెవెన్యూశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే సర్కార్ ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ జిల్లా పేరును ధారాశివ్‌గా మారుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Also: NavIC: ఐఫోన్15లో NavIC టెక్నాలజీ.. ఈ ఇస్రో టెక్నాలజీ ఏంటో తెలుసా..?
2022 జూన్ 29న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వం చివరి క్యాబినెట్ సమావేశంలో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సమయంలో ఏక్‌నాథ్ షిండే వర్గం ప్రభుత్వంపై తిరుగుబాటు చేసింది, ఈ క్యాబినెట్ సమావేశం జరగడానికి ముందే గవర్నర్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించారు. ఈ ఆదేశాల తర్వాత పేరు మార్పు చట్ట విరుద్ధమని, ఆ తర్వాత ప్రమాణస్వీకారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే-ఫడ్నవీస్ సర్కార్ చెప్పింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను వరుసగా ఛత్రపతి శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చడానికి గత ఏడాది జూలైలో షిండే ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంతకుముందు ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్ గా ఉంది, అయితే ప్రస్తుతం దానికి ఛత్రపతిని జోడించి ఛత్రపతి శంభాజీనగర్ గా పేరు మార్చారు.