ైఢిల్లీ బాబా తరహాలో మహారాష్ట్రలో కూడా మరో కీచక పర్వం వెలుగుచూసింది. బాబా ముసుగులో విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడి కటకటాలపాలయ్యాడు. తాజాగా మహారాష్ట్రలో కూడా అదే తరహాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని రత్నగిరిలోని వార్కారీ గురుకులం అధిపతి భగవాన్ కొకరే మహారాజ్ కీచక పర్వానికి దిగాడు.
ఇది కూడా చదవండి: Maharashtra: సీఎం ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయిన మల్లోజుల.. ఆయుధాలు అందజేత
తనపై గురుకుల్ అధిపతి భగవాన్ కొకరే, ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మైనర్ విద్యార్థిని ఆరోపించింది. గదిలోకి వచ్చి ఛాతీని గుద్దినట్లు తెలిపింది. జూన్ 12న బాధితురాలు అడ్మిషన్ పొందింది. గురుకులంలో చేరిన ఒక వారం రోజులు బాగానే ఉంది. అనంతరం వేధింపులు ప్రారంభమయ్యాయి. కోకరే మాటిమాటికి గదికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. గుద్దడమే కాకుండా.. ఛాతీని తాకేవాడని చెప్పింది. బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించేవాడని.. తండ్రిని, సోదరుడిని చంపేస్తానని బెదిరించే వారని వాపోయింది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల్లో ‘ఉచిత భార్య’ వాగ్దానం కూడా ఇవ్వొచ్చు.. దుమారం రేపుతున్న ఎంపీ వ్యాఖ్యలు
జరిగిన అన్యాయాన్ని సోమవారం బాధితురాలు తండ్రికి తెలియజేసింది. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. దీంతో గురుకుల అధిపతి కోకరే, ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్‌ను అరెస్ట్ చేసి రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉంచారు.
ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన ఎమ్మెల్యే భాస్కర్ జాదవ్ మాట్లాడుతూ.. ఈ వేధింపులకు చాలా మంది బాలికలు బలై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కోకరేతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులను, ఆయనను సందర్శించిన వారిని కూడా బయటపెడతానని తెలిపారు.
ఇది కూడా చదవండి: US-Venezuela: వెనిజులా తీరంలో డ్రగ్స్ నౌకపై దాడి.. ఆరుగురు హతం
