NTV Telugu Site icon

మ‌హారాష్ట్రలో పెరిగిన రిక‌వ‌రీ కేసులు..

covid

క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌లోనే కాదు.. సెకండ్ వేవ్‌లోనూ మ‌హారాష్ట్రలో మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.. దేశంలోనే అత్య‌ధిక కేసులు వెలుగు చూస్తూ వ‌స్తోన్న మ‌హారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య కాస్త త‌గ్గినా.. ఇంకా భారీగానే న‌మోదు అవుతున్నాయి.. తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గడచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో రిక‌వ‌రీ కేసులు పెరిగాయి.. కొత్తగా 34,389 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ కాగా.. మరో 974 మంది ప్రాణాలు వ‌దిలారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో రిక‌వ‌రీ కేసులు పాజిటివ్ కేసుల‌ను క్రాస్ చేశాయి.. ఒకే రోజు 59,318 మంది కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 53,78,452కు పెర‌గ‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్‌తో 81,486 మంది మృతిచెందారు.. ప్రస్తుతం మ‌హారాష్ట్రలో 4,68,109 యాక్టివ్‌ కేసులున్నాయ‌ని బులెటిన్‌లో పేర్కొంది స‌ర్కార్.