Maharashtra: మహారాష్ట్రలో ఎన్నికలకు ముందే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ ఆవులను ‘రాజ్యమాత- గోమాత’గా ప్రకటిస్తు ఆదేశాలు జారీ చేసింది. వేద కాలం నుంచి ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుంది సర్కార్. మానవ పోషణలో దేశవాళీ ఆవుల పాత్ర కీలకంగా ఉంది. వాటి పాల ప్రాముఖ్యత, ఆయుర్వేద, పంచగవ్య చికిత్సలు, సేంద్రియ వ్యవసాయంలో ఆవు ఎరువుల వినియోగం ఉంది. ఎన్నో రకాలుగా దేశవాళీ ఆవులు ఉపయోగ పడుతున్నాయి.
Read Also: Unstoppable: స్టార్ హీరోతో బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’..
దీంతో రాష్ట్ర వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పశు సంవర్ధకాల్లో దేశీయ ఆవుల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. భారత సమాజంలో ఆవుల ఆధ్యాత్మిక, శాస్త్రీయ, చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని చెప్పుకొచ్చారు.