Johnson Baby: జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది. శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జాన్సన్స్ బేబీ పౌడర్ నవజాత శిశువుల చర్మంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. జాన్సన్ బేబీ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్‌ఫెక్షన్ వస్తున్నట్లు ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. ప్రయోగశాల పరీక్షలో శిశువులకు పౌడర్ నమూనాలు ప్రామాణిక పీహెచ్ విలువకు అనుగుణంగా లేవని రెగ్యులేటర్ తన ప్రకటనలో తెలిపింది. కోల్‌కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంది. పుణె, నాసిక్‌ల నుంచి పౌడర్ శ్యాంపిళ్లను సేకరించి మహారాష్ట్రలో పరీక్షలు చేశారు.
Cheetahs to India: చీతాలు వచ్చేశాయ్.. చీతా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న ప్రధాని
ఆ తర్వాత, డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940 నిబంధనల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది, అంతేకాకుండా మార్కెట్ నుంచి పేర్కొన్న ఉత్పత్తి స్టాక్‌ను రీకాల్ చేయాలని కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ విశ్లేషకుల నివేదికను సంస్థ అంగీకరించలేదు. దానిని సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీకి పంపినందుకు కోర్టులో సవాల్ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి వివరణాత్మక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
