Maha Kumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళలో ఆదివారం రోజు భారీ అగ్ని ప్రమాదం రిగింది. సెక్టార్-19 క్యాంప్‌సైట్ ప్రాంతంలో రెండు నుండి మూడు గ్యాస్ సిలిండర్లు పేలిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భక్తుల భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏ హాని జరగలేదు. పరిస్థితిని అంచనా వేయడానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ అగ్నిప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు.
Read Also: Botsa Satyanarayana: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై అనుమానాలున్నాయి..
అగ్ని ప్రమాదం గురించి ప్రధాని నరేంద్రమోడీ సీఎం యోగినికి ఫోన్ చేసి ఆరా తీశారు. నివేదిక ప్రకారం.. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కనీసం 18 గుడారాలు కాలిపోయాయి. అయితే, వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించిన మండల్ని ఆర్పేశారు. వీరికి ఎన్డీఆర్ఎఫ్ కూడా సహకరించింది. ప్రస్తుతం చుట్టుపక్కల టెంట్‌లలో ఉన్న వారిని ముందు జాగ్రత్తగా అధికారులు ఖాళీ చేయించారు.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభ మేళ జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం, జనవరి 18 వరకు త్రివేణి సంగమ ప్రదేశంలో 7.72 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మరో 4 ముఖ్యమైన పవిత్ర స్నానాలు ఉన్నాయి, ఇవి జరిగే రోజుల్లో భక్తుల సంఖ్య మరింతగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తదుపరి ముఖ్యమైన స్నాన తేదీలలో జనవరి 29 (మౌని అమావాస్య – రెండవ షాహి స్నాన్), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి – మూడవ షాహి స్నాన్), ఫిబ్రవరి 12 (మాఘి పూర్ణిమ), ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి) రోజున ఉన్నాయి.