ఏ వస్తువు పైకి ఎగరవేసినా కిందపడుతుంది. భూమి ఆకర్షణ వలన ఈ విధంగా జరుగుతుంది. అయితే, భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లో భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కిందపడే వస్తువులు గాల్లోకి తెలుతుంటాయి. దీనికి ఓ ఉదాహరణ రివర్స్ జలపాతం. ఈ జలపాతం రివర్స్‌లో కిందపడకుండా నీరు పైకి చిమ్ముతుంటుంది. ఇకపోతే, ఇండియాలో కూడా ఇలాంటి వింత ఒకటి ఉన్నది. లడఖ్‌లోని లేహ్-కార్గిల్-బాల్టిక్ జాతీయ రహదారి పక్కన ఓ మ్యాగ్నెటిక్ హిల్ ఉన్నది. ఆ ప్రాంతానికి చేరుకోగానే వాహనాలను న్యూట్రల్‌లో పెట్టి ఇంజన్ ఆఫ్ చేసినా వాహనాలు ముందుకు కదులుతాయి. దీనికి కారణం అక్కడ ఉన్న కొండకు అయస్కాంత శక్తి ఉండటమే అంటారు. ఇప్పటికీ ఈ కొండ మిస్టరీగానే ఉన్నది. నిజంగా ఈ కొండలో మాగ్నటిక్ పవర్ ఉన్నదా లేదంటే మరేమైనా కారణమా అన్నది తెలియాల్సి ఉన్నది.
ఇండియాలోని మాగ్నటిక్ హిల్ గురించి మీకు తెలుసా?
