Madras High Court on Kallakurichi student death: తమిళనాడు రాష్ట్రంలో పాటు యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారిన కళ్లకురిచి కేసులో మద్రాస్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును తప్పుదారి పట్టించడాన్ని మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. 17 ఏళ్ల విద్యార్థిని మరణం కేవలం ఆత్మహత్యేనని.. హత్య, అత్యాచారం కాదని స్పష్టం చేసింది. తమిళనాడు కళ్లకురిచిలో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపింది. విద్యార్థులు పెద్ద నిరసనలు చేపట్టి ఆందోళనలు నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తడితోనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.
బాలిక మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టాన్ని నిర్వహించారు. పుదుచ్చేరి జిప్‌మర్‌కు చెందిన ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం నివేదిక ఆధారంగా జస్టిస్ జికె ఇళంతిరైయన్ ఈ వ్యాఖ్యాలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాథమికంగా బాలిక మరణం ఆత్మహత్యే అని తెలుస్తోందని.. హత్య, అత్యాచారం కాదని అన్నారు. బాలిక శరీరంపై అయిన గాయాలు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకడంతో అయినవే అని నిర్థారించారు.
Read Also: Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.
అత్యాచారం, హత్య కింద ఎలాంటి ఆధారాలు లభించలేదని.. మరణించిన విద్యార్థిని సూసైడ్ నోట్ పరిశీలించినా.. కెమిస్ట్రీ సబ్జెక్టులో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే మూడో అంతస్తు మెట్ల వద్ద రక్తంగా అనుమానించిన ఎరుపురంగు గుర్తులు రక్తం కాదని వెల్లడించింది. ఈ కేసులో గతం వారం పాఠశాలకు సంబంధించిన ఉపాధ్యాయులు, నిర్వాహకులు ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది.
సేలం జిల్లా కళ్లకురుచ్చిలోని ఓ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని జూలై 13న హస్టల్ ఆవరణలో శవమై కనిపించింది. ఉపాధ్యాయుల వేధింపులు తాళలేకే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె తల్లిదండ్రలు ఆరోపించారు. దీంతో జూలై 17న పాఠశాలలో తీవ్రంగా హింస చెలరేగింది. బస్సులను కాల్చేశారు ఆందోళనకారులు. అయితే ఈ కేసులో ఏ తప్పు చేయని వారిని 45 రోజులకు పైగా జైలో ఉంచడం దురదృష్టకమరని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసులో ఆందోళనలకు పాల్పడ్డ వారిని పోలీసులు గుర్తించారు. ఇందులో మైనర్లతో పాటు 53 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ కేసి రిమాండ్ కు తరలించారు. సెప్టెంబర్ 27కు ఈ కేసును వాయిదా వేశారు.
