Site icon NTV Telugu

Madhya Pradesh: 4 లీటర్ల పేయింట్ వేయడానికి 233 మంది వ్యక్తులా.? ఇదేం దోపిడి భయ్యా..

Madhya Pradesh

Madhya Pradesh

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ నిర్మాణ సంస్థ సర్కారును దోపిడీ చేసే ప్రయత్నం చేసింది. గణితానికి కూడా అంతుచిక్కని విధంగా బిల్లులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన రిసిప్ట్‌లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సకండి గ్రామాలో ప్రభుత్వ పాఠశాలలో ఒక గోడకు 4 లీటర్ల పెయింట్‌ని వేయడానికి 168 మంది వర్కర్లు, 65 మంది మేస్త్రీలను నియమించుకున్నట్లు బిల్లు పెట్టారు. ఒక్క గోడకు ఇంతమంది ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Pakistan: మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకున్న పాక్ ప్రధాని.. భారత్‌పై లేనిపోని ఆరోపణలు..

ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు పరిశీలనకు వెళ్లారు. సకండి లోని ఒక పాఠశాలలో కేవలం 4 లీటర్ల ఆయిల్ పెయింట్ వేయడానికి రూ. 1.07 లక్షలు, నిపానియా గ్రామంలో మరో పాఠశాలో 20 లీటర్ల పేయింట్ వేయడానికి రూ. 2.3 లక్షలు విత్ డ్రా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సకండిలో గోడకు 168 మంది కార్మికులు, 65 మేస్త్రీలను ఉపయోగించగా, నిపానియాలో 10 కిటికీలు, నాలుగు తలుపులు పెయింట్ చేయడానికి 275 మంది కార్మికులు,150 మంది మేస్త్రీలను నియమించికున్నట్లు పేర్కొనడం గమనార్హం.

ఇదిలా ఉంటే, నిజానికి ఈ లెక్కలన్నీ కాగితం పైన మాత్రమే ఉన్నాయి. గోడలపై ఎలాంటి పెయింట్ లేకపోవడం మరో విచిత్రం. ఈ పనిని నిర్వహించిన నిర్మాణ సంస్థ సుధాకర్ కన్‌స్ట్రక్షన్ మే 5, 2025లో ఒక బిల్లును రూపొందించింది. దీనిని ఒక నెల ముందు ఏప్రిల్ 4న నిపానియా స్కూల్ ప్రిన్సిపాల్ ధ్రువీకరించడం గమనార్హం. పనికి సంబంధించిన ఫోటోలు లేకుందడా, కేవలం బిల్లుల ద్వారానే డబ్బులు విత్ డ్రా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ రెండు స్కూల్ బిల్లులు వైరల్ కావడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఫూల్ సింగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Exit mobile version